మద్యం మత్తులో పందెం 400 కిలోమీటర్ల పరుగు – ప్రపంచంలో రికార్డ్

Betting under the influence of alcohol is a 400-kilometer run

0
56

మద్యం మత్తులో కొందరు చేసే పనులు చివరకు ప్రాణాల మీదకు కూడా వస్తూ ఉంటాయి.
ఆ మత్తులో ఏం చేస్తారో సరిగ్గా అవగాహన ఉండదు. ఇలాంటి సమయంలో కొందరు పందెలు కూడా వేస్తూ ఉంటారు. ఇలా చివరకు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న కొందరు స్నేహితులు వింత పనులు చేశారు.

సవాళ్ల నేపథ్యంలో వారు పర్వత ప్రాంతాల మీదుగా 400 కిలోమీటర్లు నడిచారు. ఆశ్చర్యంగా ఉందా నిజంగా వీరి పందెం వింటే షాక్ అవుతాం. అసలు ఇలా ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు . దాదాపు 400 కిలోమీటర్ల నడక పూర్తి చేశారు పందెం కట్టి.జోడీ బ్రాగ్గర్, జోడీ గౌల్డ్, గేబ్ గిగ్లియోన్ అనే ముగ్గురు స్నేహితులు. వీరు మందుతాగి ఈ పందెం వేసుకున్నారు.

అది ఏమిటి అంటే? వారి దగ్గర ఓ గ్లోబ్ ఉంది దానిపై వేళ్లు పెట్టిన చోటకు పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి గ్లోబ్ పై వేలు పెట్టాడు. అది తజికిస్తాన్ ని చూపించింది. అక్కడ నుంచి సుమారు 400 కిలోమీటర్లు పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని చైనా, తజికిస్తాన్ బర్తాంగ్ లోయ వరకూ వెళ్లారు. ఎన్నో ఆపసోపాలు పడ్డారు కాని పందెం కోసం అక్కడ వరకూ వెళ్లారు. ఈ ముగ్గురు స్నేహితుల ప్రయాణాన్ని సోర్సరీ ఫిలిమ్స్ కు చెందిన అలెక్సిస్ టైమన్, బెన్ క్రోక్ డాక్యుమెంట్ చేశారు. 7 రోజుల్లో వీరు ఈ పందెం ప్రయాణం పూర్తి చేశారు.