ఈ 9 ఆండ్రాయిడ్ యాప్ లతో జాగ్రత్త – ఫోన్ లో ఉంటే తొలగించండి

Beware with these 9 Android apps - remove if on phone

0
101

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. డేటా కూడా తక్కువ ధరకు వస్తుందని చాలా మంది అనేక రకాల యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. ముందు ఏ యాప్ డౌన్ లోడ్ చేస్తున్నా కచ్చితంగా ఆ యాప్ మంచిదా కాదా సెక్యూర్డ్ యాపేనా తెలుసుకోవాలి.
గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఆండ్రాయిడ్ యాప్ లన్నీ మంచివే అనుకోవడానికి వీల్లేదు. డాక్టర్ వెబ్ అనే మాల్వేర్ విశ్లేషణ సంస్థ కొన్ని ఆండ్రాయిడ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.

సో మీ ఫోన్ లో ఈ 9 యాప్స్ ఉంటే వెంటనే తొలగించండి. ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి గూగుల్ వాటిని తొలగించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఈ 9 యాప్ లలో ఏది ఉన్నా జాగ్రత్తపడాలని డాక్టర్ వెబ్ హెచ్చరించింది.

పీఐపీ ఫొటో (PIP Photo)
ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo)
రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner)
హారోస్కోప్ డైలీ (Horoscope Daily)
ఇన్ వెల్ ఫిట్ నెస్ (Inwell Fitness)
యాప్ లాక్ కీప్ (App Lock Keep)
లాక్ ఇట్ మాస్టర్ (Lockit Master)
హారోస్కోప్ పై (Horoscope Pi)
యాప్ లాక్ మేనేజర్ (App Lock Manager)