బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాని ప్లేస్ లో ఆ యువ హీరో ?

బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాని ప్లేస్ లో ఆ యువ హీరో ?

0
111

స్టార్ మా లో ప్రస్తుతం బిగ్ బాస్ 2 షో జరుగుతున్న విషయం తెలిసిందే కాగా బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేయనున్నట్లు అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి . బిగ్ బాస్ 1 సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాడు , ఎన్టీఆర్ యాంకర్ గా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు అలాగే 1 సీజన్ ని గెలిపించాడు కట్ చేస్తే ఇప్పుడు సెకండ్ సీజన్ నడుస్తోంది కాగా ఈ సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు , ఇక సీజన్ కు మొదట్లో అంతగా కలిసి రాలేదు కానీ నెమ్మదినెమ్మదిగా ఊపు మీదకొచ్చింది .

తాజాగా ఈ బిగ్ బాస్ హౌజ్ లోకి క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ రావడంతో బిగ్ బాస్ 3 సీజన్ కు అతడే హోస్ట్ అంటూ ప్రచారం మొదలయ్యింది . అయినా విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరిస్తే తప్పకుండా బుల్లితెరపై సంచలనమే అవుతుంది ఎందుకంటే అతడి డైలాగ్ డిక్షన్ అలా ఉంటుంది మరి . తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయం .అంతేకాదు బిగ్ బాస్ షో అంటేనే గ్లామర్ కాబట్టి విజయ్ దేవరకొండ మరింత గ్లామర్ ని యాడ్ చేయడం ఖాయం .