నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్..లక్నోతో తలపడనున్న బెంగళూరు

0
59

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఎంతో ఆసక్తికరంగా అన్ని మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే  31 మ్యాచ్‌ లు పూర్తి అయిపోయి..ఇవాళ 32 మ్యాచ్ లో తలపడానికి లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ అకాడమీ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లు… మంచి ఫామ్‌ లో ఉన్నాయి.మరి ఈరోజు విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలు ఇలా..

లక్నో సూపర్ జెయింట్స్:కేఎల్ రాహుల్ , క్వింటన్ డి కాక్ , మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్