ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్..దిల్లీ X గుజరాత్ ఢీ..ప్లేయింగ్ XI ఇదే?

0
136

చూస్తుండగానే ఐపీఎల్ 2022 మొదటివారం ముగిసింది. తాజాగా నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్​ టైటాన్స్​ జట్లు నేడు రెండో మ్యాచ్​లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆడిన మొదటి మ్యాచ్ లో గెలిచిన ఈ రెండు జట్లు మరో విజయం కోసం తహతహలాడుతున్నాయి.  రాత్రి 7.30 గంటలకు ఎంసీఏ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

దిల్లీ: పంత్ నేతృత్వంలోని జట్టుకు అతిపెద్ద ఉపశమనం ఏమిటంటే, క్వారంటైన్​ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్​ రెహ్మాన్​, సర్ఫరాజ్​ ఖాన్​ జట్టులో చేరడం. అయితే మన్​దీప్​, రిషభ్​ పంత్​, పావెల్​ ఆశించిన మేర రాణించకపోవడం జట్టుకు మైనస్.  డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, నార్జ్ జట్టులో చేరడానికి సమయం పట్టనుంది. అక్షర్, లలిత్ ఫామ్ జట్టుకు సానుకూలం. సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం లభించే ఛాన్స్.

గుజరాత్: టోర్నీలో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్ మన్ గిల్, విజయ్ శంకర్‌ల వైఫల్యం జట్టును నిరాశ పరిచింది. రషీద్ జట్టుకు అదనపు బలం. మరి చివరకు ఈ మ్యాచ్​లో ఎవరు నెగ్గుతారో చూడాలి. మహ్మద్ షమీ ఫామ్ లో ఉండడం. గుజరాత్ టైటాన్స్ విన్నింగ్ కాంబినేషన్‌తోనే ఈ మ్యాచ్‌లోకి దిగనుంది.