ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్..రాజస్థాన్ X కోల్‌ కత్తా..ఇరు జట్ల వివరాలివే

0
123

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 30 మ్యాచ్ లో తలపడానికి రాజస్థాన్ రాయల్స్, కోల్‌ కత్త నైట్‌ రైడర్స్‌ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరుగనుంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై ఘోర పరాజయం చవిచూసిన కోల్‌కత్త నైట్‌ రైడర్స్‌ మరి ఈరోజు గెలుపు కోసం తమ ప్రతిభను చూపెట్టుకోవాల్సిందే. ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

రాజస్థాన్ రాయల్స్‌ : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ : ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హ