మల్టీనేషనల్ పిజ్జా సంస్థ డొమినోస్ మీరాబాయి చానుకు బిగ్ ఆఫర్

Big offer for multinational pizza company Domino's Mirabai Chanu

0
79

వెయిట్ లిఫ్టింగ్లో పతకం కోసం భారతదేశం 21 సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించింది మీరాబాయి చాను. ఒక చరిత్ర సృష్టించింది. ఆమె 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఈ పతకాన్ని గెలుచుకుంది. మొత్తం 202 కిలోలను ఎత్తి మీరాబాయి పతకాన్ని గెలుచుకుంది.
అందరూ ఆమెని అభినందిస్తున్నారు.

మీరాబాయి చాను పతకం సాధించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు బహుమతులను ప్రకటించాయి. ఇక మణిపూర్ సర్కారు నజరానా ప్రకటించింది. డొమినోస్ ఇండియా కూడా ఆమెకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పిజ్జా సంస్థ డొమినోస్ మీరాబాయి చానుకు లైఫ్ టైం ఫ్రీ పిజ్జా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం ట్వీట్ ద్వారా తెలిపింది.

ఇటీవల మీరాబాయి చాను ఒక న్యూస్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పిజ్జాను చాలాకాలంగా తినలేదని, అందుకే నేను పిజ్జా తినాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దీంతో డొమినోస్ ఈ ప్రకటన చేసింది. ఆమెకి ఉచితంగా జీవితకాలం పిజ్జా ఇస్తాము అని తెలిపింది.