బ్రేకింగ్ – ఒలింపిక్ పతకం నెగ్గిన మీరాబాయి చానుకు భారీ నజరానా

Big prize for Olympic medalist Mirabai Chanu

0
77
.

టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మణిపూర్ అమ్మాయి మీరాబాయి చాను తొలి పతకం సాధించింది. అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో రజతం గెలిచిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి అందించనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయం ఆమెకి ఫోన్ చేసి తెలిపారు.

ఇకపై నువ్వు రైల్వే స్టేషన్ల దగ్గర టికెట్ కలెక్టర్ గా పనిచేయాల్సిన అవసరం లేదు. నీకు ప్రత్యేక ఉద్యోగం సిద్దం చేశాము అని తెలిపారు. హోంమంత్రితో సమావేశం తర్వాత నిన్ను ఆశ్చర్యపరిచే అంశం వెల్లడిస్తాం అని మీరాబాయి చానుకి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆమెకి ప్రశంసలు అందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అందరూ ఆమెకి అభినందనలు తెలియచేస్తున్నారు.

చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 202 కేజీలు ఎత్తి రజత పతకం గెలిచింది.చైనాకు చెందిన ఝి హుయి హౌ మొత్తం 210 కేజీలు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకుంది. ఇండోనేషియాకు చెందిన కాంతికా ఐసా 194 కేజీలు ఎత్తి కాంస్యం దక్కించుకుంది.