పంత్‌కి భారీ షాక్‌!..జట్టులోకి వృద్ధిమాన్ సాహా?

Big shock to Pant! .. Wriddhiman Saha into the team?

0
98

టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ప్రొటిస్‌ 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్ట్‌ ఇరు జట్లుకు కీలకం కానుంది. భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్‌ జనవరి 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ వికెట్‌ పారేసుకున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ అనవసర షాట్ల ఎంపికపై ఇప్పటికే రచ్చ జరిగింది. మరోసారి పంత్ షాట్ ఎంపికపై మాట్లాడుకునేలా చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు.

దీనితో మూడో టెస్టులో అతడిని తప్పించి వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. దీంతో కేప్ టౌన్ టెస్ట్‌కు పంత్‌ను తప్పించే ఆలోచనలో కోహ్లి, కోచ్‌ ద్రవిడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్నాళ్లగా రిషబ్‌ పంత్‌ అంత ఫామ్‌లో లేడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్‌ నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 59 పరగులు మాత్రమే చేశాడు పంత్.