కోహ్లీ గాయంపై బిగ్ అప్‌డేట్..రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?

Big update on Kohli's injury..what did Rahul Dravid say?

0
80

దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న టీమ్‌ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఇండియా రెండో టెస్టులో ఓటమి రుచి చూసింది. దీనితో 3 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.

ఈ నేపథ్యంలో మూడో టెస్టు నిర్ణయాత్మకంగా, ఉత్కంఠభరితంగా మారింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గాయం కారణంగా జోహన్నెస్‌బర్గ్ టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ప్రాముఖ్యత కూడా కీలకం కానుంది. విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌లో ఆఖరి, నిర్ణయాత్మక పోరులో అడుగుపెడతాడా లేదా అనే దాని గురించి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద అప్‌డేట్ అందించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టెస్టు కెప్టెన్సీలో రాహుల్‌కి ఇదే అరంగేట్రం. అయితే, అతను తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించలేకపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 240 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కాపాడుకోవడంలో విఫలమై, 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ప్రస్తుతం అందరిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, దక్షిణాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టుకు కోహ్లీ తిరిగి వస్తాడా? లేదా?

దీనిపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి సమాధానం వచ్చింది. విరాట్ కోహ్లి గాయం, అతని ఫిట్‌నెస్‌పై తాజా అప్‌డేట్‌లను అందించాడు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘నెట్స్‌లో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతను ఇంకా ఫిజియోతో చర్చించలేదు. ప్రస్తుతం అయితే ఫిట్‌నెస్‌‌తోనే కనిపిస్తున్నాడు’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.