బిగ్ బాస్ గొంతుకి ఎంత రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు

బిగ్ బాస్ గొంతుకి ఎంత రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు

0
104

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 2 ప్రారంభం అయి పది రోజులు గడిచిపోయింది. బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుండి అందరు ఈ కార్యక్రమం గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే TRP రేటింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయంటోంది మాటీవీ యాజమాన్యం. బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే, రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో కూడా అన్ని రంగాలకు చెందిన పార్టిసిపెంట్స్ ని తీసుకున్నారు. సీజన్ మారింది.. పార్టిసిపెంట్స్ మారారు.. హోస్ట్ మారాడు.కానీ బిగ్ బాస్ వాయిస్ మాత్రం మారలేదు. మొదటి సీజన్ లో ఎంత గంబీరంగా వాయిస్ వినిపించి పార్టిసిపెంట్స్ లో సీరియస్ నెస్ ని పెంచిందో, అలాగే ఈ సీజన్ లో కూడా అదే ఫాలో అవుతుంది. కంటికి కనిపించని బిగ్ బాస్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండటం సహజమే. అంత బేస్ వాయిస్ ఉన్న వ్యక్తిని చూడడానికి కూడా అంతే గంబీరంగా ఉంటాడా అనే సందేహం చాలా మందిలో ఉన్నది. వాస్తవానికి బిగ్ బాస్ అనే పాత్ర ఉహాజనితమైంది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ ఆలోచనలను బిగ్ బాస్ పాత్ర ద్వారా చెప్పిస్తారు.

ఇక బిగ్ బాస్ లా మాట్లాడే గొంతు ఎవరది అంటే.. టీవీ సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్ట్ ది అని తెలిసింది. గతంలో టాలీవుడ్ లో రాధాకృష్ణ పరభాషా విలన్ లకు కూడా డబ్బింగ్ చెప్పారు. బిగ్ బాస్ వాయిస్ కి కూడా భారీగా పారితోషికం ఇస్తున్నారట. సీజన్ మొత్తానికి బిగ్ బాస్ వాయిస్ చెప్పినందుకు 5 లక్షలు పారితోషికం ఇస్తున్నారట.