బిగ్ బాస్ షో ఒక ఎపిసోడ్ కి ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

బిగ్ బాస్ షో ఒక ఎపిసోడ్ కి ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

0
162

ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్న బిగ్ బాస్ షో ఎందుకు స్టార్ట్ చేశారో.. రోజుకి ఎంత సంపాదిస్తుందో ఎవరికి తెలీదు. కేవలం ఈ బిగ్ బాస్ షో మాత్రమే కాదు ఏ టీవీ షో అయినా తనకు వచ్చే మనీ గురుంచి ఎప్పుడూ బయట పెట్టదు.ఈ బిగ్ బాస్ షో ని మా టీవీ లో ప్రతిరోజూ టెలికాస్ట్ చేస్తారు. మధ్యాహ్నం మరియు రాత్రిపూట కూడా షో ని చూపిస్తారు.

ఈ షో కి మూడు మార్గాలలో మనీ వస్తుంది.

అన్నింటి కంటే ఎక్కువగా మన టీవీ లలో చూపించే యాడ్స్ వాళ్ళ ఈ బిగ్ బాస్ షో కి ఎక్కువ మనీ వస్తుంది.

మా టీవీ లో తక్కువ రేటింగ్ వున్నా షో లో 10 సెకండ్స్ యాడ్ వేయ్యాలంటే 4,000/ తీసుకుంటారు. అదే ఎక్కువ రేటింగ్ ఉన్న షో లో 10 సెకండ్స్ యాడ్ వేయ్యాలంటే 20,000/ వరకు తీసుకుంటారు. పండగ టైం లో అయితే 10 సెకండ్స్ యాడ్ కి 45,000/ వరకు తీసుకుంటారు. కానీ బిగ్ బాస్ లాంటి షోస్ కి రేటింగ్ ఉండటం వల్ల, దీని బ్రేక్ లో 10 సెకండ్స్ యాడ్ వేయ్యాలంటే లక్ష రూపాయల వరకు తీసుకుంటారు.

ఒక్క రోజులో బిగ్ బాస్ ఎపిసోడ్ లో 30 నిముషాల బ్రేక్ వస్తుంది అంటే కేవలం యాడ్స్ వల్ల ఒక్క రోజుకి 60,00,000/ వరకు వస్తుంది. మొత్తం బిగ్ బాస్ షో లో 106 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే మొత్తం బిగ్ బాస్ షో కి కేవలం యాడ్స్ వల్ల 63,60,00,000/ వస్తాయి. ఇందులో వాళ్ళు 50 లక్షల రూపాయలను ప్రైజ్ మనీ గా ఇస్తారు.

వింటూ ఉంటే చాలా విడ్డురం గా వుంది కదూ…బిజినెస్ అంటే ఇదే మరి…

కేవలం యాడ్స్ వల్ల మాత్రమే కాదు.. ఈ బిగ్ బాస్ షోస్ కి కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి..ఈ మనీ కూడా కోట్లలోనే ఉంటుంది కానీ ఆ వివరాలు మనకు తెలీవు. ఏది ఏమైనా బిగ్ బాస్ మాత్రం ఒక పెద్ద బిజినెస్..