రెండో టీ20పై నీలిమేఘాలు..హైకోర్టులో పిల్..ఏం జరగనుందో?

Blue clouds on the second T20..Pill in the High Court..what will happen?

0
115

భారత్-న్యూజిలాండ్​ మధ్య జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ధీరజ్ కుమార్​.. ఝార్ఖండ్​ హైకోర్టులో పిల్​ వేశారు. మ్యాచ్​ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని అన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ భయంతో ఇంకా పాఠశాలలు మూసే ఉన్నాయని..వైరస్​ భయం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని ధీరజ్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర జరిగే క్రికెట్ మ్యాచ్​కు 100 శాతం మంది వీక్షకులను ఎలా అనుమతిస్తారని అడిగారు.

మ్యాచ్​ను వాయిదా వేయడం లేదా 50 శాతం మంది వీక్షకులనే అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది ధీరజ్..​ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.