తెలంగాణాలో నేటి నుంచి బోనాల పండగ షురూ..

0
103

సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ అంటే ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణలో బోనాల పండగ నేటి నుంచి ప్రారంభంకానుంది.

సుమారు నెలరోజులపాటు బంధువులు, సన్నిహితులు ఆనందంగా జరుపుకునే ఈ ఆషాడ బోనాల ఉత్సవాలు నేడు ప్రారంభం అవుతున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు ప్రారంభం కానుందని ప్రకటించారు.  ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు.

నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం అలాగే తోటలను తీసుకువెళ్తారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకొనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అధికారులు  అంచనా వేస్తున్నారు.