ఒక్క ఫైట్ తో ఏకంగా 742 కోట్లు సంపాదించిన బాక్సర్ – అతని ఆస్తులు ఎంతంటే

Boxer who earned 742 crores in a single fight

0
110

ఒక్క ఫైట్ తో ఏకంగా 742 కోట్లు సంపాదన ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతోందా. అవును బాక్సర్లకు ఆ విధంగానే సంపాదన ఉంటుంది. ఓ ఫేక్ ఫైట్ తో ఏకంగా 100 మిలియన్లు సాధించాడు. అమెరికా దిగ్గజ బాక్సర్ ఫ్లయిడ్ మెవెదర్.. టీమిండియా విరాట్ కోహ్లీ ఏడాదికి దాదాపు రూ. 192 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే నాలుగేళ్లు సంపాదన జస్ట్ ఒక్క ఫైట్ తో సంపాదించాడు.

జూన్ మొదటి వారంలో లోగన్ పాల్ అనే యూట్యూబర్తో ఆ అమెరికా బాక్సర్ ఫ్లయిడ్ మెవెదర్ తలపడ్డాడు. ఇదంతా ఓ ఫేక్ ఫైట్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ ఫైట్ లోనే ఆ నగదు వచ్చింది అన్నాడు. అయితే ఈ ఫైట్లో యూట్యూబర్పై ఒక్క పంచ్ కూడా చేయలేదు. ఈ మ్యాచ్పై చాలా సందేహాలు, విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ మ్యాచ్లో మెవెదర్ ఓడిపోయాడు. అయినా అతని ఖాతాలో రూ. 742 కోట్లు వచ్చి చేరాయి. ఇక అతని ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? మన కరెన్సీలో 8500 కోట్లు ఉంటుంది.2017లో బాక్సింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అతని దగ్గర వందల కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు వస్తువులు ఉన్నాయి ఖరీదైన వాచీలు, బంగారం, వజ్రాలు ఉన్నాయి. రూ. 350 కోట్లతో వరల్డ్ క్లాస్ జెట్ ఫ్లైట్ కూడా ఉంది.