బ్రేకింగ్ — సన్ రైజ‌ర్స్ జట్టులో ఆంధ్ర బౌలర్ – కొత్త ఛాన్స్

-

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆటగాళ్లు తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు, అయితే ఆటగాళ్లని గాయాలు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇప్పటికే కొందరు ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్ లకి దూరం అవుతున్నారు.

- Advertisement -

తాజాగా ఆంధ్ర రంజీ జట్టు పేస్ బౌలర్ యెర్రా పృథ్వీరాజ్ ఐపీఎల్ –13లో గాయపడిన సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ స్థానంలోకి వచ్చాడు. దీంతో ఇది అతనికి ఓ గొప్ప అవకాశం అని అభిమానులు అంటున్నారు, అయితే అతని భర్తీపై సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్ వేస్తుండగా భువీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో దాని తీవ్రత పెరిగింది.

దీంతో తదుపరి మ్యాచ్కే కాకుండా గాయం తీవ్రత దష్ట్యా ఏకంగా లీగ్కే దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల పృథ్వీరాజ్కు ఐపీఎల్ కొత్తేం కాదు. గతేడాది కోల్కతా నైట్రైడర్స్ తరఫున రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. అలాగే 11 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన ఈ పేసర్ 39 వికెట్లు తీశాడు. దీంతో అతని అభిమానులు పృథ్వీరాజ్ ఆట ఎలా ఉంటుందో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...