మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అభిమానులు ఎంతో ఫీల్ అయ్యారు, అయితే అదే బాటలో మరో క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు,టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అతని అభిమానులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.
పార్థివ్ పటేల్ 2002లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచుతో వన్డే క్రికెట్లోకి ప్రవేశించాడు…2003 ప్రపంచ కప్ స్వాడ్ కూ ఎంపికయ్యాడు…ఇక ఆయనకు మ్యాచుల్లో అవకాశం రాలేదు. వికెట్ కీపర్లుగా మొదట రాహుల్ ద్రవిడ్, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ దూసుకువచ్చారు, ఇక తర్వాత దినేశ్ కార్తీక్ కూడా జట్టులో రాణించాడు.
అందుకే పార్దీవ్ కు అవకాశాలు రాలేదు..కెరీర్ లో మొత్తం 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో ఆయన మొత్తం 934 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా 62 క్యాచులు పట్టాడు. వన్డేల్లో మొత్తం 736 పరుగులు చేసి, 30 క్యాచులు పట్టాడు.ఐపీఎల్ లో కూడా మెరిశాడు, కాని చాళా ఏళ్లుగా మ్యాచులకి దూరంగా ఉంటున్నాడు.