బ్రేకింగ్ – కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ – అసలు ఏమైందంటే

బ్రేకింగ్ - కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ - అసలు ఏమైందంటే

0
109

ఈ కరోనాకి పేద, ధనిక అనే తేడా లేదు…దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది…కేసులు భారీగా నమోదు అవుతున్నాయి..

ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలకు సినిమా నటులకి పారిశ్రామిక వేత్తలకు క్రికెటర్లకు కరోనా సోకింది,

చాలా మంది ఇంటిలో ఉండి జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు, మరికొందరు ఆస్పత్రిలో చేరారు, అయితే క్రీడాకారులని చూస్తే

ఇప్పటికే సచిన్, పఠాన్ బ్రదర్స్, బద్రీనాథ్లకు కరోనా సోకింది.

 

 

ఇక ఇటీవల సచిన్ కు కరోనా సోకింది అని తెలిసి ఒక్కసారిగా క్రీడాలోకం షాక్ కి గురి అయింది, అయితే ఆయన ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు… కాని నిన్నటి నుంచి ఆయనకు కరోనా లక్షణాలు మరింత పెరిగాయి, జ్వరం జలుబు తీవ్రంగా ఉండటంతో ఆయన వెంటనే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు.

 

త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్వీట్ చేశారు. మార్చి 27న సచిన్ కరోనా బారీన పడ్డారు. ఇక సచిన్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.. దేవాలయాల్లో చర్చిల్లో పూజలు ప్రార్ధనలు చేస్తున్నారు.