ఈ ఏడాది చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఆటకు గుడ్ బై చెబుతున్నారు, యువ ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచన, అలాగే రిటైర్మెంట్ ప్రకటించాలి అనే యోచనలో చాలా మంది సీనియర్లు ఇలా గుడ్ బై చెబుతున్నారు, ఇక అభిమానులు మాత్రం ఇంత సులువుగా దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజాగా విండీస్ సీనియర్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. శామ్యూల్స్ ఆట అందరికి ఇష్టమే, తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుంటాడు.
2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు శామ్యూల్స్, చాలా మంది సీనియర్లతో ఆడాడు, అలాగే మిడిలార్డర్ బ్యాటింగ్లో కీలకంగా నిలిచాడు.
207 వన్డేలు, 71 టెస్టులు,67 టీ20లు ఆడాడు తన కెరియర్లో, అంతేకాదు ఈ అన్నీ ఇగ్నింగ్స్ లో 17 సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్స్పిన్ బౌలింగ్తోనూ 152 వికెట్లు తీశాడు.
క్రికెట్ లో విండీస్ గెలుపులకి తన పాత్ర కూడా ఉంది, మంచి ఆటగాడు ఈ నిర్ణయం ప్రకటించడంతో విండీస్ అభిమానులు షాక్ అయ్యారు.