Breaking News : రేవ్ పార్టీలో పట్టుబడిన దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు అమ్మాయిలు

Four girls from the Southern film industry caught up in a rave party

0
112

నాసిక్ అంటే వైన్ కాపిటల్ అనే చెబుతారు. తాజాగా ఇక్కడ రేవ్ పార్టీ జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీలో కొంతమందిని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో నలుగురు యువతులు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నాసిక్ ఇగాత్పురిలోని స్కైతాజ్, స్కై లగూన్ అనే రెండు ఖరీదైన విల్లాల్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు అనే సమాచారం వచ్చింది పోలీసులకి.

అక్కడకు పోలీసులు వెళ్లి చూస్తే అప్పటికే మద్యం సేవించారు యువకులు. ఇక పక్కన విదేశీ మద్యం కూడా ఉంది. ఈ రైడ్లో పోలీసులు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో 10 మంది పురుషులు ఉంటే, 12 మంది స్త్రీలు వున్నారు. అయితే అరెస్టు చేసిన వారిలో ఓ మహిళ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్. అలాగే దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన మోడల్స్ కూడా ఉన్నారు. వారి పేర్లు బయటకు రాలేదు.

వీరందరిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు సహకరించిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకులాట చేస్తున్నారు.