క్రీడాలోకంలో విషాదం అలముకుంది, నెంబర్ వన్ ఫస్ట్ క్లాజ్ క్రికెటర్ వసంత్ రాయిజి(100) శనివారం ఉదయం కన్నుమూశారు. జనవరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా 100వ పుట్టిన రోజు జరుపుకొన్నారాయన.. ఇక దక్షిణ ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.దీంతో క్రీడా రంగం వారు ఎంతో కలత చెందారు.
క్రీడాకారుల్లో ఆయనది ఓ రికార్డు అని చెప్పాలి, 100 ఏళ్లు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, కుడిచేతి బ్యాట్స్మన్ అయిన ఈ మాజీ క్రికెటర్ 1940 ల్లో తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడారు. మొత్తం 277 పరుగులు చేయగా, 68 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశారు.
ఇక దక్షిణ బాంబేలోని జింఖానా మైదానంలో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. దీంతో ఆయన ఇన్నాళ్లు టీమిండియా ఆట చూశారు, 1939 నుంచి క్రికెట్లో ఉన్నారు.. లాలాఅమర్నాథ్, విజయ్ మర్చెంట్, సీకే నాయుడు, విజయ్ హజారే లాంటి తొలితరం ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. తర్వాత ఛార్టెడ్ అకౌంటెంట్గా మారి దక్షిణ ముంబయిలోనే స్థిరపడ్డారు. ఇక ఆయన క్రికెటర్ల గురించి పలు పుస్తకాలు రాశారు, ఆయన మరణంతో విషాదంలో మునిగారు క్రీడాకారులు.