ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నందున న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి 2,3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. కరోనాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా కోర్టు ఆంక్షలు విధించాలని ఆదేశించింది.