ముంబై ముందు నుంచి దూకుడుగానే ఆడింది, ఐపీఎల్ సమరంలో ఈ సీజన్ లో అనుకున్న తీరాలకి చేరింది, తిరుగులేని విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-1లో దుమ్మురేపింది.
మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపి ముంబై ఫైనల్ కు చేరింది.
ఇలా ముంబై ఫైనల్ కు వెళ్లడం ఇది ఆరోసారి, ఇది ముంబైకి రికార్డు అనే చెప్పాలి.200 పరుగులు చేసిన ముంబై ఢిల్లికి 201 పరుగుల లక్ష్యం ఇచ్చింది, బరిలోకి దిగిన బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో వికెట్లు పడిపోయాయి, దీంతో ముంబైకి విజయం మరింత ఈజీ అయింది.
ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. దీంతో రోహిత్‌సేన 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ చివరి వరకూ ఎంత పోరాటం చేసినా విజయం ముంబైకి దక్కింది. ఢిల్లీకి ఆదిలోనే హంసపాదు అనేలా ముగ్గురు టాప్ ఆర్డర్ లో డక్ అవుట్ అయ్యారు. ముంబై ఫ్యాన్స్ ఈ విజయంతో మరింత రెట్టింపు ఆనందంలో ఉన్నారు.