భువి అద్భుత క్యాచ్‌ అదరహో!

భువి అద్భుత క్యాచ్‌ అదరహో!

0
84

భారత్‌ X వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ 35వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా భువి బౌలింగ్‌కు వచ్చాడు. గుడ్‌లెంగ్త్‌లో పడిన ఐదో బంతిని ఛేజ్‌.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి రిటర్న్‌ క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే స్పందించి ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో బంతి అందుకున్నాడు. దీంతో ఛేజ్‌ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌ చేరాడు.

కాగా అదే ఓవర్‌లో భువనేశ్వర్‌ అంతకుముందే నికోలస్‌ పూరన్‌(42)ని ఔట్‌ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ భువి ఒకే ఓవర్‌లో వెనక్కి పంపి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. పూరన్‌, ఛేజ్‌ ఔటయ్యాక విండీస్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. ఆదిలోనే క్రిస్‌గేల్‌ (11)ని ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించడంతో పాటు ఆఖర్లో కీమర్‌రోచ్‌ను(0) డకౌట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ 31 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈనెల 14న ఇదే మైదానంలో ఆఖరి వన్డే జరగనుంది.