సీనియర్లు సహకరిస్తే పంత్‌కు ఎంజాయ్, ఇంటర్వ్యూపై చాహల్ కౌంటర్

సీనియర్లు సహకరిస్తే పంత్‌కు ఎంజాయ్, ఇంటర్వ్యూపై చాహల్ కౌంటర్

0
83

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బీసీసీఐ చేసిన ట్వీట్‌పై అనూహ్యంగా స్పందించాడు. వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌తో భారత్ క్లీన్ స్వీప్ సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్‌ను హిట్ మాన్ ఇంటర్వ్యూ చేశాడు. రెండు టీ20ల్లోనూ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ మూడో టీ20కి దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన రిషబ్ పంత్(65; 42బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు)తో అజేయంగా నిలిచాడు.

తొలి 2మ్యాచ్‌ల కంటే మూడో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్‌తో రోహిత్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ గత మ్యాచ్‌లలో తక్కువ స్కోరు నమోదు చేసినా ఈ మ్యాచ్ అదరగొట్టావు. ఎలా సాధ్యమైంది. ఈ రోజు సక్సెస్ అయింది. మరి కొన్ని సార్లు ప్లాన్ ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావని అడిగాడు. బదులిచ్చిన పంత్.. ‘రోహిత్ భాయ్.. నేను కొన్ని సార్లు ఆడాలని ప్రయత్నించి ఫెయిలవుతా. మరి కొన్ని సార్లు సక్సెస్ అవుతా. ఇవాళ అదే జరిగింది’ అని తెలిపాడు.

టీమిండియా నీ మీద నమ్మకముంచింది. దానిని నువ్వు ఒత్తిడిగా భావిస్తున్నావా.. లేదా కచ్చితంగా సాధించగలననే నమ్మకంతో ఉన్నావా అని అడిగాడు. దానికి పంత్.. ఒత్తిడిలా అనిపిస్తుంది కానీ, ఎప్పుడైతే జట్టులో ఉన్న సీనియర్లు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు ఆడడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ ఒత్తిడిలా భావించను అని సమాధానమిచ్చాడు.