టీమ్​ఇండియా పర్యటనలో మార్పులు..కొత్త షెడ్యూల్​ ఇదే..

Changes in Team India tour..this is the new schedule ..

0
104

కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్​ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్​ సౌత్​ ఆఫ్రికా (సీఎస్​ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు కొత్త తేదీలను ఖరారు చేసింది.

ఈనెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన టెస్టులు 26 నుంచి.. జనవరి 11 నుంచి జరగనున్న వన్డే సిరీస్​ 19వ తేదీ నుంచి జరగనున్నట్లు వెల్లడించింది. బీసీసీఐతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.

కొత్త షెడ్యూల్​..

తొలి టెస్టు- డిసెంబరు 26-30 – సెంచూరియన్​

రెండో టెస్టు – జనవరి 3-7 – జోహన్నెస్​​బర్గ్​

మూడో టెస్టు – జనవరి 11-15 – కేప్​టౌన్​

వన్డే సిరీస్​

మొదటి వన్డే – జనవరి 19 – పార్ల్​

రెండో వన్డే – జనవరి 21 – పార్ల్​

మూడో వన్డే – జనవరి 23 – కేప్​టౌన్