చెన్నై వర్సెస్ ఢిల్లీ..గెలుపెవరిదో?

Chennai vs Delhi..who will win?

0
110

ఐపీఎల్ 2021లో గ్రూప్ స్టేజ్ ముగిసిపోయింది. ఇక ప్లేఆఫ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ -1​ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం జరిగే మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో లీగ్​లో చెన్నై, ఢిల్లీ బలాబలాలు ఓసారి చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రధాన బలం ఆ జట్టు ఓపెనర్స్. డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉంటూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు. చెన్నై మిడిలార్డర్ అంత బలంగా లేదు. మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు టచ్ లో లేరు. ధోని కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జడేజా ఒకటి రెండు మ్యాచ్ ల్లో మెరిసిన ఇంకా బాకీ ఉన్నాడు.

బౌలింగ్ విషయానికొస్తే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, బ్రేవో, హెజిల్ వుడ్ ఉన్నా ఒక్క శార్దూల్ మాత్రమే అనుకున్న మేర రాణిస్తున్నాడు. సీఎస్కె ఆడిన గత మూడు మ్యాచ్ లు ఓడిపోవడం ఆ జట్టును కుంగదీస్తుందనే చెప్పుకోవాలి. సీఎస్కె ఓపెనర్స్ రాణిస్తే పెద్ద స్కోరు ఖాయంగా చెప్పుకోవచ్చు.

రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఆ జట్టు ఓపెనర్స్ శిఖర్ ధావన్, పృథ్వీ షా పరుగుల వరద పారిస్తున్నారు. మిడిలార్డర్ విషయానికొస్తే శ్రేయస్, పంత్, హెట్ మేయర్ పరుగులు చేస్తున్న వాటిని అర్ధశతకాలు, శతకాలుగా మార్చలేకపోతున్నారు. ఈ మధ్య జట్టులోకి వచ్చిన రిపల్ పటేల్ పెద్దగా రాణించలేదు. అతని స్థానంలో స్మిత్ ను ఆడిస్తే ఢిల్లీ బ్యాటింగ్ మరింత భీకరంగా మారుతుంది.

పేస్ బౌలింగ్ లో వారికి తిరుగులేదు. నోకియా, ఆవేష్ ఖాన్ రాణిస్తుండగా రబడా ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. స్పిన్ విభాగంలో సీనియర్లు అశ్విన్, అక్షర్ ఉన్నారు. గత మ్యాచ్ లో ఆర్సీబి చేతిలో ఓడిన ఢిల్లీకి ఓటమి ఒక పాఠంగా భావించి తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంది. సమిష్టిగా రాణిస్తే ఢిల్లీకి విజయం నల్లేరు మీద నడకే.

దీంతో ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో దిల్లీ, చెన్నై పోటీపడనున్నాయి. చెన్నై ఇక్కడ గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరనుంది. ఒకవేళ ఓడినా రెండో క్వాలిఫయర్‌లో అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పటికే వరుసగా మూడు ఓటములతో సతమతమవుతున్న ధోనీసేన ప్రస్తుతం పూర్తి బలంగా ఉన్న దిల్లీని ఓడించడం అంత తేలిక కాదు. ఇక అప్పుడు కూడా ఓటమిపాలైతే రెండో క్వాలిఫయర్‌లో పుంజుకోవడం కష్టమనే చెప్పాలి. ఏదేమైనా ఆదివారం ధోనీసేన గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.