క్రిస్ గేల్ అంటే మాములుగా ఉండదు – బ్యాట్ రెండు ముక్కలైంది వీడియో వైరల్

Chris Gayle Bat Two Split Video Viral

0
71

క్రికెట్లో క్రిస్ గేల్ అంటే తెలియని వారు ఉండరు . అతను మైదానంలో ఉన్నాడు అంటే బంతికి బాదుడే.
సిక్సులు ఫోర్లతో పరుగులు పెట్టిస్తాడు బౌలర్లని. ఇక అతను గ్రీజులో ఉన్నాడు అంటే మ్యాచ్ విజయం అంటారు అందరూ. ఇక జస్ట్ ఒక్క ఓవర్ లో మ్యాచ్ స్వరూపం మార్చేస్తాడు ఈ ఆటగాడు. అందుకే అన్నీ దేశాల్లో గేల్ కు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా విండీస్లో జరుగుతున్న సీపీఎల్ 2021లో క్రిస్ గేల్ సెంట్ కిట్స్ తరుపున ఆడుతున్నాడు.
అయితే గయానా అమెజాన్ వారియర్స్, సెంట్ కిట్స్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది. ఈ సమయంలో బౌలర్ బంతి వేయగానే గేల్ షాట్ కొట్టాలనుకున్నాడు. కానీ క్రిస్గేల్ బ్యాట్ రెండు ముక్కలైంది.

గేల్ బాల్ ని ఆఫ్సైడ్ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. చివరకు బ్యాట్ కింద పడింది బ్యాట్ కు ఉన్న హ్యాండిల్ గేల్ చేతిలో ఉండిపోయింది.
బ్యాట్ విరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

https://twitter.com/CPL/status/1437901450974150658