శ్రీలంక పర్యటనకు భారత టీమ్ వెళ్లనుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రకటన చేసింది.
జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జూలై నాలుగు వరకూ ఆటగాళ్లు అందరూ క్వారంటైన్ లో ఉంటారు.
ఇక తర్వాత మన ఆటగాళ్లు రెండు టీమ్ గా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడతారు. షెడ్యూల్ ప్రకారం జులై 13, 16, 18న వన్డే మ్యాచ్ లు, 21, 23, 25వ తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇక మన క్రీడా అభిమానులు ఈ మ్యాచ్ ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే టీమ్ ను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక వెళ్లే మన టీమ్ కి
ద్రావిడ్ కోచ్ గా ఉంటారని తేలిపోయింది. సోమవారం నుంచి వారం పాటు జట్టు సభ్యులను కఠినమైన క్వారంటైన్ లో ఉంచినట్టు తెలియచేశారు సభ్యులు.