పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్… స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఏం చేసినా సంచలనమే.అతని ఆట ప్రపంచానికే నచ్చుతుంది. అన్నీ దేశాల్లో అతనికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తాజాగా ఓ మీడియా సమావేశంలో రొనాల్డో ఇచ్చిన ఓ చిన్న సందేశం.కోకోకోలా కంపెనీకి 4 బిలియన్ డాలర్లు నష్టం తెచ్చిపెట్టింది.
హంగేరితో మ్యాచ్ కు ముందు క్రిస్టియానో రొనాల్డో తన టీమ్ తరపున మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇక టేబుల్ పై రెండు కోకోకోలా బాటిల్స్ ఉన్నాయి. వాటిని పక్కకు జరిపి మంచినీళ్లు తాగాలి అని చెప్పారు. అంతేకాదు వాటర్ బాటిల్ పైకెత్తి చూపించారు. యూరో 2020కి కోకోకోలా కంపెనీ కూడా ఒక స్పాన్సర్ గా ఉన్నప్పటికీ, రొనాల్డో కోకోకోలాను పక్కకు పెట్టేయడం అక్కడ మీడియాని సభ్యులని షాక్ కి గురిచేసింది.
ఫుట్ బాల్ స్టార్ చేసిన పనికి ఏకంగా కంపెనీ షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. ఆ సందేశంతో కంపెనీకి 4 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కోకోకోలా మార్కెట్ విలువ 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.https://youtu.be/xZLyzBQ-uwY