సౌరవ్‌ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం

Coca-Cola makes key decision on Sourav Ganguly

0
93

ప్రముఖ బెవరేజస్‌ కంపెనీ కోకాకోలా ఇండియా భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీపై  కీలక నిర్ణయం తీసుకుంది. సౌరవ్‌ను మరో మూడేళ్లపాటు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగిస్తున్నట్లు కోకాకోలా ఒక ప్రకటనలో పేర్కొంది. 2017లో సౌరవ్‌ గంగూలీను కోకాకోలా ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంపెనీ నియమించింది. మరో మూడేళ్లపాటు సౌరవ్‌ గంగూలీతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని కోకాకోలా ఇండియా అండ్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్నబ్‌ రాయ్‌ అన్నారు.

భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్స్‌లో దూకుడును ప్రదర్శిస్తున్నారు. సౌరవ్‌ ఇప్పటకీ డీటీడీసీ, టాటా టెట్లీ, పుమా, ఎస్లియర్‌ లెన్స్, సెన్కో గోల్డ్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఒక ఏడాది పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం కోసం సౌరవ్‌ ఒక్కో బ్రాండ్‌ నుంచి  సుమారు కోటి రూపాయలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.