ఫ్లాష్- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి మళ్లీ కరోనా..కానీ ఈ సారి..

Corona again for Dada..but this time ..

0
80

టీమ్​ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఒక్కరోజు వ్యవధిలో మళ్లీ కొవిడ్ బారినపడ్డాడు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్​ వేరియంట్​ సోకినట్లు సమాచారం. శనివారం రాత్రి చేసిన పరీక్షల్లో దాదాకు పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కాగా అంతకుముందే కరోనా బారిన పడిన గంగూలీ కోల్​కతాలోని వుడ్​లాండ్స్​ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శుక్రవారం(డిసెంబరు 31) సాయంత్రం డిశ్చార్జి అయ్యాడు. అంతలోనే ఒక్కరోజు వ్యవధిలో దాదాకు మరోసారి పాజిటివ్​గా తేలింది. అయితే కొవిడ్​ లక్షణాలు స్వల్పంగా ఉండటం వల్ల ఈ సారి ఇంట్లోనే ఐషోలేషన్​లో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.