కరోనా బాధితులకు భారీ సాయం – కోహ్లీ అనుష్క శర్మ

కరోనా బాధితులకు భారీ సాయం - కోహ్లీ అనుష్క శర్మ

0
104

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. రోజుకి ఏకంగా మూడు నుంచి నాలుగు లక్షల పాజిటీవ్ కేసులు వస్తున్నాయి.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి… ఇలాంటి సమయాల్లో చాలా మంది ధనవంతులు పెద్దలు పేదలకు సాయం చేస్తున్నారు… అంతేకాదు పెద్ద మనసు చేసుకుని కోట్ల రూపాయల విరాళం ఆక్సిజన్లు శానిటైజర్ మాస్కులు ఆహారం ఇలా అందిస్తున్నారు.

 

ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు సినిమా నటులు క్రీడాకారులు చాలా మంది కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు…అయితే కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో సాయం అందించేందుకు విరాళాల సేకరణ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ముందుకు వచ్చారు.

 

తమ వంతుగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. మన దేశంలో సాయం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని వారికి సాయం చేయాలి అని కోరారు ఈ జంట.. కెట్టో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎంతో కొంత సాయం చేయాలని కోరారు.కెట్టోకు విరాళాలు పంపాలని ఈ విరాళాలతో కోవిడ్ రోగులకు సాయం చేయచ్చు అని తెలిపారు.

 

ట్వీట్ ..