Flash: ఢిల్లీ క్యాపిటల్స్‌ లో మరో ఆటగాడికి కరోనా పాజిటివ్..

0
99

ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కరోనా వెంటాడుతూనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా తర్వాత మిచెల్ మార్ష్ తో పాటు మరో నలుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో మ్యాచ్ జరిగే వేదికను కూడా మార్చారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. ఐపీఎల్‌ లో మరో కొత్త కేసు నమోదు కావడంతో ఇవాళ జరగాల్సిన మ్యాచ్ ను కొనసాగిస్తారా అనే దానిపై సందిగ్థత నెలకొంది. దీనిపై బీసీసీఐ కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనుంది.