క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే..త్వరలో మహిళల ఐపీఎల్..జైషా క్లారిటీ!

Cricket fans' festival .. Women's IPL soon..Jaisha Clarity!

0
90

మహిళల ఐపీఎల్​ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. పురుషుల ఐపీఎల్​ తరహాలోనే దీన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని చెప్పారు.

మహిళల టీ20 ఛాలెంజ్​ అభిమానుల్లో భారీ ఆసక్తిని నెలకొల్పింది. మహిళల క్రికెట్​ను ప్రోత్సాహిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. వారి కోసం ఐపీఎల్​ లాంటి ఓ లీగ్​ కావాలి. కేవలం మూడు, నాలుగు జట్ల మధ్య పోటీని నిర్వహించడం మాత్రమే కాదు మహిళల ఐపీఎల్​ లీగ్​ను ప్రారంభించడం లాంటిది. ఇందులోకి చాలా అంశాలు వస్తాయి. అంతర్జాతీయ స్టార్​లు, బోర్డు సభ్యుల మధ్య ద్వైపాక్షిక కమిట్​మెంట్స్​ ఇలా చాలా ఉంటాయి. భవిష్యత్​ మహిళా క్రికెటర్ల కోసం ఈ లీగ్​ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం.

అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. భారతదేశంలో క్రికెట్ స్థాయిని మరింత పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్​ కౌర్​ లాంటి ప్లేయర్స్​ కూడా ఈ లీగ్​ను తీసుకురావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇది ప్లేయర్స్​కు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ది హండ్రెడ్​ లీగ్​, డబ్ల్యూబీబీఎల్​ వంటి లీగ్స్​లో దీప్తి శర్మ, రోడ్రిగ్స్​, షెఫాలీ వర్మ, పూనమ్​ యాదవ్​ వంటి ఆటగాళ్ల అదరగొడుతున్నారు. రోల్​ మోడల్స్​గా ఎదుగుతున్నారు.” అని జైషా అన్నారు.