బ్రేకింగ్ – శిఖర్ ధావన్ అయేషా ముఖర్జీ విడాకులు

Cricketer Shikhar Dhawan divorces Ayesha Mukherjee

0
74

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ అయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని
అయేషా ముఖర్జీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ విషయం చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని అయేషా తెలిపారు.

దీనిపై శిఖర్ దావన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. మెల్బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే అయేషాకి ఇది రెండో వివాహం గతంలో ఆమెకి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు జొరావర్ పుట్టాడు.

ఇక 9 సంవత్సరాలు ఎంతో సంతోషంగా కాపురం చేసింది ఈ జంట కాని నేడు విడాకులు తీసుకున్నారు. ఇక అయేషా ఇన్ స్టాలో ఈ పోస్టులో కొన్ని విషయాలు తెలిపారు.వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తివంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు. ఫస్ట్ టైమ్ విడాకులు తీసుకున్న సమయంలో చాలా భయపడ్డాను, తన తల్లిదండ్రులు పిల్లను నిరాశకు గురిచేశాను ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే అతి భయంకరంగా ఉందని ఆమె తెలిపింది.