క్రిస్ గేల్ ట్వీట్ రిటైర్మెంట్ గురించేనా- అభిమానుల్లో ఆందోళన

క్రిస్ గేల్ ట్వీట్ రిటైర్మెంట్ గురించేనా- అభిమానుల్లో ఆందోళన

0
90

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ టీ 20 అద్బుతంగా సాగుతోంది, మొత్తానికి ప్లేఆఫ్ ఆటలు ఆడుతున్నారు ఆటగాల్లు.. కొన్ని జట్లు ఇప్పటికే బ్యాక్ అయ్యాయి, కొన్ని జట్లు ముందుకు వెళుతున్నాయి, ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటనల గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

పంజాబ్ టీమ్ ఆదివారమే వెనక్కి వచ్చేసింది, ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. పంజాబ్ బ్యాట్స్మన్ క్రిస్గేల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసి తన అభిమానులను అయోమయానికి గురి చేశాడు. నా సీజన్ పూర్తయినా.. మీరంతా ఈ టీ20 లీగ్ను వీక్షిస్తూ తరించండి అని పేర్కొంటూ ధన్యవాదాలు చెప్పాడు.

అయితే ఈ ట్వీట్ చూసి గేల్ అభిమానులు షాక్ అయ్యారు, యూనివర్శ్ బాస్ రిటైర్ అవుతారా ఏమిటి ఈ నిర్ణయం ముందు ట్వీటా అని చాలా మంది సందిగ్దంలో పడ్డారు, మీరు రిటైర్ అవ్వద్దు అని కోరారు గేల్ ని, ఇంకా మీరు చాలా ఇన్నింగ్స్ ఆడాలి అని మేము కోరుకుంటున్నాం అని అభిమానులు కోరారు.