పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మొత్తంగా రొనాల్డో తన కెరీర్‌లో 58 హ్యాట్రిక్‌లు సాధించి, సమకాలీన ఫుట్‌బాలర్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.