Flash: IPL మెగా వేలంపై సీఎస్కె ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

0
68

ఐపీఎల్ మెగా వేలంపై టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లను పశువులను కొన్నట్టు కొన్నారని ఉతప్ప మండిపడ్డాడు. వేలం తీరు చూస్తే క్రికెటర్లు కూడా మనుషులేనా అన్న విషయాన్ని ప్రాంఛైజీలు మర్చిపోయినట్టు అనిపిస్తుంది అని అన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా వేలం సమయంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఈ నేపథ్యంలో ఊతప్ప ఈ వ్యాఖ్యలు చేశాడు.