వాట్సన్ ఫామ్ లోకి వ‌చ్చాడు సీఎస్‌కే ఇక దూకుడే

వాట్సన్ ఫామ్ లోకి వ‌చ్చాడు సీఎస్‌కే ఇక దూకుడే

0
94

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్కే దుమ్ముదులిపేస్తోంది. నిన్న జ‌రిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఇద్ద‌రు బ్యాట్స్ మెన్స్ చెల‌రేగిపోయారు,. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్‌కే.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.

పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

వాట్సన్ అద‌ర‌గొట్టాడు, ఇక డుప్లెసిస్ త‌న‌దైన సైలిలో ఫోర్లు బాదాడు, బౌల‌ర్ల‌కు ఇద్ద‌రూ చుక్క‌లు చూపించారు అనే చెప్పాలి…ఈ టోర్నీ ఆరంభమైన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్‌.. తాజా మ్యాచ్‌లో విశేషంగా రాణించడంతో సీఎస్‌కే 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కేకు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ అంద‌రిని ఆక‌ట్టుకుంది, ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన మ్యాచుల్లో అత్య‌ధికంగా మ్యాచ్ ని సీఎస్కే అభిమానులు ఎంజాయ్ చేసింది ఇదేనంటున్నారు సోష‌ల్ మీడియాలో.