‘పుష్ప’ సాంగ్​లో డేవిడ్ వార్నర్..కోహ్లీ ఫన్నీ రిప్లై (వీడియో)

David Warner in 'Pushpa' Song..Kohli Funny Reply (Video)

0
105

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాలలో ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. కొత్త కొత్త వీడియోలు పోస్ట్​ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంటాడు. తాజాగా యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఇంగ్లాండ్​పై విజయం అనంతరం కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు వార్నర్.

అల్లుఅర్జున్ ‘పుష్ప’ సినిమాలోని ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్​ని మార్ఫ్​ చేశాడు. ‘కాప్షన్​ దిస్’ అనే కామెంట్​ను జోడించాడు. ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసిన ఈ వీడియోపై టీమ్​ఇండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘మేట్ ఆర్​ యూ ఓకే (మిత్రమా నువ్వు బానే ఉన్నావా?)’ అని విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. క్రికెట్ అభిమానులు కూడా ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది.

గత ఐపీఎల్​లో వార్నర్​కు చేదు అనుభవం ఎదురైంది. కారణం కూడా చెప్పకుండా ఎస్​ఆర్​హెచ్​ అతడిని కెప్టెన్​గా తొలగించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో కొనసాగే ఉద్దేశంలేదని వార్నర్​ నిక్కచ్ఛిగా చెప్పేశాడు. వచ్చే సీజన్​ కోసం ఏ జట్టు అతడిని తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.instagram.com/p/CXVv7sbJU1X/