వరుస విజయాలతో దూసుకుపోతోంది ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్ లో అద్భుతమైన ఆట కనబరిచింది,
దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్యాపిటల్స్ నిర్ధేశించిన 197 పరుగుల టార్గెట్ను చేధించడంలో ఆర్సీబీ విఫలమైంది.
బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్నింటా ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది.. ముందు నుంచి బెంగళూర్ బాట్స్మెన్స్ విఫలం చెందారు అని అంటున్నారు అభిమానులు. అశ్విన్ వేసిన మూడో ఓవర్లో పడిక్కల్ వికెట్తో మెుదలైన బెంగళూరు వికెట్ల పతనం క్రమంగా కొనసాగింది.
కాస్త విరాట్ బాగానే ఆడి 43 రన్స్ చేశారు, తర్వాత ఆర్డర్ బాగా దెబ్బతింది.. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల కొల్పోయి 137 పరుగులు చేసింది ఢిల్లీ బౌలర్ రబడ నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని కొలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ ని చూసిన వారు అందరూ రబడ బౌలింగ్ అదరగొట్టాడు అంటున్నారు.