ధోని బాటలో సురేష్ రైనా ? ఇద్దరూ ఒకేరోజు ప్రకటనపై చర్చించుకున్నారా ?

ధోని బాటలో సురేష్ రైనా ? ఇద్దరూ ఒకేరోజు ప్రకటనపై చర్చించుకున్నారా ?

0
113

ఈ రోజు భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు.. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు, దీంతో అందరూ షాక్ అయ్యారు, అయితే అదే దారిలో మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు వెల్లడించాడు. వీరు ఇద్దరు మంచి మిత్రులు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు.

అంతేకాదు ధోనీ, రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పుడు శిక్షణ శిబిరంలో బిజీగా ఉన్నారు, అయితే కచ్చితంగా రిటైర్మెంట్ గురించి ఇద్దరు చర్చించుకుని ఉంటారు అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు నిమిషాల వ్యవధిలో ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

యువ క్రికెటర్ల కు ఛాన్స్ ఇవ్వాలి అని ఇద్దరూ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది, ఎన్నో విజయాలు అందించారు ఇద్దరు క్రికెటర్లు..దేశంలో పలువురు ప్రముఖులు వీరికి మంచి భవిష్యత్ ఉండాలి అని కోరుకుంటున్నారు, అలాగే అంతర్జాతీయ క్రికెటర్లు క్రీడాకారులు వీరిద్దరి నిర్ణయంతో మంచి భవిష్యత్ ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు.

.