భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోని అంటే అందరికి ఇష్టమే… భారత్ కు ఎన్నో విజయాలు అందించారు ఈ క్రీడాకారుడు. ధోనీ కుమార్తె జీవాతో కలిసి ధోనీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టనున్నాడు, ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.
ఈ నెలాఖరున వీళ్లిద్దరూ కలిసి అభిమానులను అలరించనున్నారు.
ఈ తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఒక ప్రకటనలో కలిసి కనిపించబోతున్నారు… వీరిద్దరూ ఓరియో (Oreo) బిస్కట్ యాడ్ లో కనిపించనున్నారు. ఇక ధోనీ ఇప్పటికే పలు కంపెనీల యాడ్స్ చేస్తున్నారు.. అయితే తాజాగా తన కుమార్తెతో కలిసి ఓయాడ్ చేయనున్నారు.
ఓరియో సంస్థ ఈ యాడ్ ఫస్ట్ లుక్ ను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది… ధోనికి జీవా అంటే ఎంతో ఇష్టం… ఎక్కడ మ్యాచ్ లకి వెళ్లినా ధోనీ తన భార్య కుమార్తెని తీసుకువెళతారు…ఖాళీ సమయాల్లో తనకూతురితోనే ఎక్కువ సమయం ఉంటారు ధోనీ..
వీరిద్దరూ కలిసి నటిస్తున్న యాడ్ ఈ నెలాఖరున విడుదల కానుంది.