క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే, ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్ మ్యాచులు ఆడుతున్నారు, అయితే ఆయన ఐపీఎల్ ఈ సీజన్ తర్వాత వచ్చే సీజన్ ఆడతారా లేదా అనే దానిపై అనేక కామెంట్లు వార్తలు వచ్చాయి, దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అని ప్రతీ ఒక్కరు ఆలోచన చేశారు, అయితే తాజాగా సీఎస్కే ఈ సీజన్లో వైఫల్యం చెందింది.
తొలిసారి చెన్నై టీమ్ ప్లేఆఫ్లో ఆడకుండా ఇంటి దారి పడుతోంది. ఇక ధోనీ వచ్చే సీజన్ లో ఆడరు అని అందరూ భావించారు, కాని ధోనీ అభిమానులు మాత్రం ఈ మాట ధోనీ నుంచి రాకూడదు అని చూస్తున్నారు..మ్యాచ్ కామెంటేటర్గా ఉన్న డ్యానీ మారిసన్ తాజాగా మ్యాచ్ లో ధోనీనీ ఇదే మీ చివరి మ్యాచ్చా అని ప్రశ్నించారు.
దాంతో.. ధోనీ కచ్చితంగా కాదు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. దాంతో.. ఐపీఎల్లో ధోనీ రిటైర్మెంట్పై పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్లోనూ చెన్నై టీమ్ని కెప్టెన్గా ధోనీనే నడిపిస్తాడని ఇటీవల చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పిన విషయం తెలిసిందే. విజయాలు అపజయాలు ఏమి వచ్చినా మా ధోనీ అంటే మాకు ప్రాణం అంటున్నారు అభిమానులు.