ఫినిషింగ్ సిక్స్ కు ధోనీ కూతురు షాక్..వీడియో వైరల్

Dhoni's daughter shocked by finishing six

0
85

ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తూ టేబుల్ టాప్ లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా..సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు.

దాంతో..తనలో అసలైన ఫినిషర్‌ ఇంకా మిగిలే ఉన్నాడంటూ ధోనీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో  మ్యాచ్‌ని స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా వీక్షించిన అతడి సతీమణి సాక్షి, కూతురు జీవా రియాక్షన్ సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని.. ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ధోని అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో ధోనీ చెన్నై వికెట్ కీపర్ గా 100 క్యాచ్ లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు.