వచ్చే ఐపీఎల్​లో ఆడటంపై ధోనీ స్పందన..

Dhoni's reaction on playing in upcoming IPL ..

0
96

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత స్థిరమైన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పేరుంది. అలాంటి జట్టుకు ప్రారంభ సీజన్‌ నుంచి మొన్న జరిగిన 14వ సీజన్‌ వరకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రికెటర్‌ ఎంఎస్ ధోనీ.

తన కెప్టెన్సీలో సీఎస్‌కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్‌ అందించాడు. అందులో ఐపీఎల్ -2021 టైటిల్‌ కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినా తనలోని నాయకత్వ లక్షణాల్లో వన్నె తగ్గలేదని నిరూపించిన ధోనీ.. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనే సందిగ్ధంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఉన్నారు.

జట్టు యాజమాన్యం మాత్రం ఎంఎస్ ధోనీని మాత్రం విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీఎస్‌కేకు వచ్చే ఏడాది ఆడతానా లేదా అనేదానిపై ఎట్టకేలకు ఎంఎస్ ధోనీ స్పందించాడు. చెన్నైలో జరిగిన ఐపీఎల్‌ 2021 టైటిల్‌ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్-2022 ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం నవంబర్‌లోనే ఉన్నాం. అయితే చెన్నైకి ఆడటంపై తప్పకుండా ఆలోచిస్తా. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. నేను ఎప్పుడూ నా క్రికెట్‌ కెరీర్‌ను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటా. అంతర్జాతీయంగా స్వదేశంలో నా చివరి మ్యాచ్‌ను రాంచీలోనే ఆడాలని అనుకున్నా. అలానే ఆడి రిటైర్‌మెంట్ తీసుకున్నా. అలాగే నా చివరి ఐపీఎల్‌ టీ20 మ్యాచ్‌ చెన్నైలోనే ఆడేస్తా. అయితే వచ్చే ఏడాదినా? ఐదేళ్ల తర్వాతా అనేది ఇంకా తెలియదుని ధోనీ వ్యాఖ్యానించాడు.