క్రికెటర్ స్మృతి మంధాన గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Did you know these things about cricketer Smriti Mandhana

0
173

స్మృతి మంధనా జులై 18, 1996 న ముంబైలో జన్మించింది. క్రికెట్ లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటోంది.
తన బ్యాటింగ్ తో పాటు అందంతో నేషనల్ క్రష్ గా మారింది. మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధానా. ఇక యూత్ లో ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రికెట్ లోనే కాదు ఆమె బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్నారు.
నైకీ ఒప్పందంతో మరింత పైకి చేరుకున్నారు.

smriti mandhana

ఏ బ్రాండ్ కి ఆమె ప్రచారం చేసినా సుమారు ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటారని టాక్ ఉంటుంది క్రీడా సమాజంలో. ఆమె ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయలు ఉండవచ్చు అంటారు. ఇటు క్రికెట్ యాడ్స్ తో పాటు, మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో ఎస్.ఎం.18 అని ఆమె ఒక కేఫ్ నడుపుతున్నారామె. ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్ కి యాడ్స్ చేస్తుంటారు.

ఇక ఆమెకి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని చెబుతుంది ఆమె. స్మృతి ఇన్స్టాగ్రామ్లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెని అభిమానులు అందరూ బాలీవుడ్ హీరోయిన్స్ తో పోలుస్తారు.