కాఫీ అధికంగా తాగుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

0
123

సాధారణంగా కాఫీ తాగడానికి చాలామంది ఇష్టపడతారు. చిన్నపెద్ద అని  తేడా లేకుండా అందరు బిస్కెట్లు కూడా ముంచుకొని తింటుంటారు. మనకు తలనొప్పిగా ఉన్న, ఏ చిన్న సమస్య వచ్చిన టీ తాగితే రిలీఫ్ గా ఉంటుందని తాగుతుంటాము. కానీ అలా తాగితే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దీనిని తాగడం వల్ల గుండె కొట్టుకోవడం సాధారణ స్థాయి నుండి అధికంగా పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రోజుకు రెండు కప్పులను మించి కాఫీ తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల ఎక్కువ గంటలు నిద్రపట్టదని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేకపోవడం వల్ల, మానసిక, నాడీ, గుండె , ప్రేగులకు సంబంధించిన సమస్యలకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. దీనితో పాటు శారీరక శ్రమ కూడా పెరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా  ఖాళీ కడుపుతో పరగడుపునే కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు.