ఐపీఎల్ ఈ మ్యాచులతో ఎంతో మంది ఫేమ్ సంపాదించుకున్నారు, ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా చాలా మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు అనే చెప్పాలి.. అయితే ధోనీ గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది..
అన్ని సీజన్లలో కలిపి రూ.150 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు నెలకొల్పాడు..
ఇలా అన్నీ సీజన్లలో కలిపి ఇంత వేతనం తీసుకున్న ఆటగాడు లేడు, కేవలం ధోనీ అనే చెప్పాలి.. ఇక మొత్తం ఐపీఎల్ లో 13 సీజన్లకు గాను ధోనీ రూ.137 కోట్లను వేతనంగా తీసుకున్నాడు. 2008లో ఆయనకు చెన్నై టీమ్ 6 కోట్లు ఇచ్చింది, తర్వాత మూడు సంవత్సరాలకు 8.50 కోట్లు 2014 నుంచి 12.5 కోట్లు.
ఇక 2018లో ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు తీసుకున్నాడు… ఇక ఈ ఏడాది కూడా 15 కోట్లు దీంతో మొత్తం 150 కోట్లు అవుతుంది..ఇక తర్వాత వరుసలో రూ.131 కోట్లతో రోహిత్శర్మ, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లీ ఉన్నారు.